ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రం లోని మానస స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లో నేడు ఆశాఢ మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని గోరింటాకు సంబరాలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఆచారాలకు అద్దం పడేలా, పిల్లల సంబరాలతో పాఠశాల ఆవరణ మెరిసిపోయింది. ఆషాడ మాసానికి స్వాగతం పలుకుతూ చిన్నారులు చేతులకు గోరింటాకు వేయించుకుంటూ, సంప్రదాయ వేషధారణలో పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. పల్లె పాటలు, ఆట పాటలతో విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. పాఠశాల ప్రాంగణం సంప్రదాయ శోభతో కళకళలాడింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రావు మాట్లాడుతూ పండుగలు పిల్లల్లో ఐక్యతను, సంస్కృతిపట్ల ప్రేమను పెంచూతాయని, పుస్తకాలే కాదు, జీవితాన్ని నేర్పే అనుభవాలూ కూడా కావాలని,అలాంటి అనుభవాలకు ఇలాంటి సంబరాలు దోహదపడతాయన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు, హరిచరణ్ రావు, మౌనిక రావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు.
