ముద్ర ప్రతినిధి, ఖమ్మం
ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాపై భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణ లోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ నెలవారి తనిఖీలో భాగంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలను పరిశీలించి అవి పని చేస్తున్న విధానాన్ని సంబంధిత సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సైరన్ పని చేయడాన్ని పరిశీలించారు. భద్రతా సిబ్బంది యొక్క షిఫ్టులు వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. భద్రతా లోపాలు లేకుండా చూడాలని చూడాలంటూ, చుట్టూ ప్రహరీ గోడ, నిర్మాణము ఎఫ్ ఎల్ సి చేపట్టడం,కావలసిన భవన నిర్మాణం గురించి అధికారులకు సూచన చేశారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం.ఎ.రాజు, ఆర్ అండ్ బి డి.ఇ.లఖన్ నాయక్, ఎన్నికల డిటి అన్సారి, ఆర్ అండ్ బి ఏ ఈ లలిత ఇతర అధికారులు ఉన్నారు.
