Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు.

 

ముద్ర, యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ స్వామి వారి హుండీలను కొండకింద సత్యనారాయణ స్వామి మండపంలోకి తరలించి ఈవో భవాని శంకర్ ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ చేపట్టారు. భక్తుల చేత 36 రోజుల హుండీ ఆదాయం 2,48,53,666 రూపాయలు వచ్చాయి. స్వామివారికి మిశ్రమ బంగారం 64 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోలు విదేశీ కరెన్సీ అమెరికా312 డాలర్లు, ఆస్ట్రేలియా 40 డాలర్లు, ఇంగ్లాండ్ 55 పౌండ్స్, నేపాల్ 55, మలేషియా 28 సింగపూర్ 9 కెన్యా 100 స్వీడన్ 20 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.