Take a fresh look at your lifestyle.

పిల్లలను ఒంటరిగా ఈతకు పంపొద్దు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచన

ముద్ర ప్రతినిధి, మెదక్:
పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. పిల్లలకు నీటి లోతు తెలియకపోవడం వల్ల జారి నీటిలో పడిపోయే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పిల్లలను
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. ఒకవేళ పిల్లలకు ఈత నేర్పించాలని అనుకుంటే తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల సరదా తల్లిదండ్రులకు జీవితాంతం మిగిలే విషాదంగా మారకూడదని అన్నారు.
గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.