Take a fresh look at your lifestyle.

భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ లకు విశ్వ సేవా రత్న బిరుదు ప్రధానం

 

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కు విశ్వ సేవా రత్న బిరుదు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రధానం చేశారు. శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా విద్యా వైద్యం కళ, సాహిత్యము సేవారంగంలో ఉగాది పురస్కార ప్రధాన ఉత్సవం కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక రవీంద్ర భారతిలో నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రావణ్, శాసన మండల సభ్యులు తల్లోజు ఆచారి, జాతీయ బీసీ కమిషనర్, జోగులంబ జిల్లా కలెక్టర్ లక్ష్మి నారాయణ, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వకర్మ లు వివిధ రంగాల్లో సేవలందిస్తూ ప్రతి ఒక్కరికి అభినందించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ లో ఇటీవల మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ లకు సుదీర్ఘ కాలంగా ప్రజా సేవలందిస్తున్న సేవాలను గుర్తించి ఉగాది పురస్కారాల ప్రధానోత్సవాల భాగంగా విశ్వసేవారత్న బిరుదు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వకర్మల
సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.