Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ధర్నా – సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC) ఆధ్వర్యంలో గురువారం నాగర్ కర్నూల్ డివిజన్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ మరియు పీస్ రేట్ కార్మికులు భారీగా ధర్నా నిర్వహించారు. జిల్లాలోని పలువురు కార్మికులు పాల్గొని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ JAC డివిజన్ చైర్మన్ మిద్దె శ్రీనివాసులు, కన్వీనర్లు జయాకర్, మల్లయ్య, JAC కంపెనీ నాయకులు సైదులు, డివిజన్ నాయకులు ప్రభాకర్, శంకర్, జితేందర్ రెడ్డి, నాగరాజు, వెంకటయ్య, రాజు, రంజిత్ కుమార్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హెచ్-82 రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథం మాట్లాడుతూ, తెలంగాణ విద్యుత్ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. APSEB సర్వీస్ రూల్స్‌ను ఆర్టిజన్ కార్మికులకు వర్తింపజేయాలని, విద్యార్హతల ఆధారంగా వారిని రెగ్యులర్ పోస్టుల్లోకి మార్చాలని కోరారు. అలాగే పీస్ రేట్ కార్మికులకు జీఓ నెం.11 ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలిపారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లను విద్యుత్ శాఖ యాజమాన్యం తక్షణమే పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

ఈ ధర్నాకు మద్దతుగా 327 యూనియన్ జిల్లా కార్యదర్శి లలయ్య, డివిజన్ అధ్యక్షుడు లక్ష్మయ్య, 1104 యూనియన్ జిల్లా కార్యదర్శి నిరంజన్ యాదవ్, హెచ్-82 యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్, SC/ST యూనియన్ డివిజన్ కార్యదర్శి నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం చొరవ చూపాలని, లేనిపక్షంలో సమ్మెకు ట్రేడ్ యూనియన్ల పూర్తి మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.