Take a fresh look at your lifestyle.

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్‌

 

ముద్ర, తిరుమల :

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి శ్రీమతి జానకి శుక్లా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆయన్ను ఆశీర్వదించారు. అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్లు అందజేశారు. దర్శనం తర్వాత టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గవర్నర్ ను పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం గవర్నర్ దంపతులు తిరుచనూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ను సందర్శించి పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.