Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలి

  • కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మితే నట్టేట ముంచారు.
  • కాంగ్రెసు అంటేనే మెాసం. బిఆర్ఎస్ పార్టీ సైనికులు ఎన్నికల్లో సత్తా చాటాలి.
  • రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరు కంటి చందర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టి..అమలుకాని అబద్ధపు మోసపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలను అగం చేసిందని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలి అని రామగుండం మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు అన్నారు. శుక్రవారం అంతర్గాం మండలం పోట్యాల గ్రామంలో తెలంగాణ కు కేసీఆర్‌ పాలనే శ్రీరామ రక్ష కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు 420 హామీలను ఇచ్చిందని వృద్ధులకు ఫించన్ లు 4000 కు పెంపు, ప్రతి మహిళాకు నెలకు 2500 రూపాయలు విద్యార్థులకు స్కూటీలు 2 లక్షల రైతు రుణమాఫీ రైతు బంధు తదతర హామీలు ఇప్పటివరకు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. 10 ఎళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించడం జరిగిందన్నారు.కెసిఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచారని రైతు బంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్ళు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు సకాలంలో అందజేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కెసిఆర్ పాలనలో రైతు రాజులుగా బతికరన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా గొప్పగా నిర్మాణం చేసి తెలంగాణ కన్నీళ్లు తుడిచినా రైతు బంధవులు కెసిఆర్ అని అన్నారు.ప్రతి ఎకరానికిసాగునీరు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసి అన్నపూర్ణగా మార్చింది కెసిఆర్ అని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలనుదృష్టిలో ఉంచుకొని రైతుభరోసాతో ప్రజల ను మాయ చేస్తున్నదన్నారు.వచ్చే స్థానిక సమరంలో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పేందుకు వేచి చూస్తున్నారని,రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల సమరంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు గులాబీ సైనికులు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టి వారు వస్తే ఆరు గ్యారెంటీల పై నిలదియలన్నారు. ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో కౌశిక హరి, మాజీ జడ్పీటిసీ ఆముల నారాయణ, గోపు అయులయ్య యాదవ్, బొండ్ల అశోక్, సందేల మల్లయ్య, బండారి ప్రవీన్ బొడ్డుపల్లి, శ్రీనివాస్, నారాయణదాసు, మారుతి, కందుల మల్లయ్య, బొండ్ల అశోక్, గాలంకే ప్రసాద్, నిమ్మరాజుల రవి, మద్దికుంట శంకర్, బొగిరి శ్రీకాంత్, ఇరుగురాళ్ల శ్రావన్, రామారాజు.

Leave A Reply

Your email address will not be published.