Take a fresh look at your lifestyle.

హైదర్నగర్ డివిజన్ లో పాఠశాల గదులను ప్రారంభించిన పీయేసీ చైర్మన్

మాదాపూర్, ముద్ర విలేఖరి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కార్నర్ స్టోన్ కంపెనీ వారి సౌజన్యంతో రూ. 20,00,000(ఇరవై లక్షల రూపాయలతో) నిర్మించిన 2 అదనపు తరగతి గదులను మరియు పాఠశాల డయాస్ ను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్బంగా చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కార్నర్ స్టోన్ కంపెనీ వారు పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సామజిక సేవ కార్యక్రమాలు చేయడం చాల అభినందనీయమని, సమాజము కోసం ఎదో చేయాలనే తపన వలన సమాజ హితం సమాజ సేవలు చేయడం చాల గొప్ప విషయం అని, కార్నర్ స్టోన్ కంపెనీ వారి ఓదార్యం చాలా గొప్పది అని, విద్యార్థులు మంచిగా చదివి తల్లిదండ్రులకు ,సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చైర్మన్ గాంధీ ఆశించారు. కార్నర్ స్టోన్ కంపెనీ సంస్త వారు ఎంతో సహృదయం తో, సామాజిక దృక్పథంతో సి. ఎస్. ఆర్ ఫండ్ కింద ఇరవై లక్షల రూపాయలతో పేద విద్యార్థుల కోసం అదనపు తరగతి గదులను మరియు డయాస్ ను నిర్మించడం చాలా గొప్ప విషయం అని,వారి ఉదరత కు చాలా అభినందనియం అని, చైర్మన్ గాంధీ కార్నర్ స్టోన్ కంపెనీ సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందించారు.అలాగే ప్రతి ఒక్కరు సమాజం కొరకుచేయూతనందించాలని చైర్మన్ గాంధీ తెలియచేసారు. సామాజిక దృక్పథంతో సమాజ సేవచేయడానికి ముందుకురావడం చాలా అభినందించ దగ్గ విషయం అని, ప్రతి ఒక్కరు కార్నర్ స్టోన్ కంపెనీ సంస్థ ను ఆదర్శంగా తీసుకోవాలని, వీరు ఎంతో మందికి ఆదర్శప్రాయులుగా నిలిచారని,సమాజం పట్ల సేవ చేయాలనే తపన సేవ చేయడానికి కార్నర్ స్టోన్ కంపెనీ సంస్థ వారిని ఎల్లవేళలా ముందు ఉంటారని కార్నర్ స్టోన్ కంపెనీ సంస్థ ను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని, వారి సేవలను చైర్మన్ గాంధీ కొనియాడారు.ఈ కార్యక్రమంలో కార్నర్ స్టోన్ కంపెనీ సంస్థ ప్రతినిధులు అభిషేక్ గుప్తా వైస్ ప్రెసిడెంట్,ఉష శ్రీ సీనియర్ టెక్నీకల్ ఆర్కిటెక్ట్, హర్ష పీటర్, కిరణ్ తనికెళ్ళ, భార్గవి, గవిర్నేని AVP, నిహల్ కటామనేని, పవన్ వలిచెర్ల, సురేంద్ర, రాము, చిరంజీవి, వెంకటేష్ శ్రీనివాసన్, తేజ్ కుమార్, హరిచైతన్య, బృందావనం, మంజుల, హరీష్, యోగేష్, బేలపురే, దేవేంద్ర రావత్, మన్సూర్ షరీఫ్, అష్రాఫ్, అలీ, నికిత ఉల్లి, శ్రీకాంత్, యశ్ అగర్వాల్, ప్రతాప్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.