ఢిల్లీ పోరాటంలో బీజేపీ కి భయపడే బీఆర్ఎస్ వెనకడుగు వేసింది
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాషలో బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము ఢిల్లీలో పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్..
కేంద్రంలోని బీజేపీకి భయపడి మాతో కలిసి రాలేదని తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు తాము పోరాటం చేశామన్న ఆయన వాటిని సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు. గురువారం శాసనసభలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కలిసి పోరాటం చేయాలనుకుంటే తమతో కలిసి రావాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తాము డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేసి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఒక ప్రయత్నం చేశామన్నారు. బలహీనవర్గాల పక్షాన నిలడ్డ వ్యక్తి, తప్పును సరిచేయాలని ముందుకొచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్‍లో పర్యటించిన సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తామని చెప్పారు. అందుకోసం అనుగుణంగా తమ ప్రయత్నం తాము చేశామన్నారు. కంకా చేస్తూనే ఉంటామన్నారు. ఎన్డీయే కూటమి సభ్యులు సైతం రాష్ట్రపతి వద్దకు వెళ్లి బీసీ రిడర్వేషన్ల అంశంపై ప్రయత్నం చేశామన్నారు. అంతే తప్ప తమ పోరాటాన్ని తమ కమిట్‍మెంట్‍ను శంకించాల్సిన అవసరం లేదన్నారు.