Take a fresh look at your lifestyle.

ఎస్సీ యువతకు స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా లోని షెడ్యూల్డు కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు తద్వారా ఆర్ధిక పురోగతి పెంపొందిచాలనే లక్ష్యంతో షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, వికారాబాద్ జిల్లా వారు ఎస్.సి. యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రూ.1.00 లక్ష రూపాయల వరకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు (90% సబ్సిడీ, రూ.3.00 లక్షల విలువ గల (తిచక్ర ఎలక్ట్రికల్ ఆటో (ప్యాసింజర్/ గూడ్స్) వాహనాలు (70% సబ్సిడీ) రూ.3.00 నుండి రూ.7.00 లక్షల (రూ.5.00 లక్షల వరకు 60% సబ్సిడీ) విలువ గల సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ వ్యవసాయ అనుబంధ భాగాల యూనిట్లను లోన్ల (కింద ప్రకటించడం జరిగింది. వయస్సు 21-50 సంవత్సరాలు లు కల అభ్యర్థులు ఉపాధి హామీ పథకాలకు మరియు 21-60 సం,,లు కల అభ్యర్థులు భూసంబంధ, వ్యవసాయ/ సోలార్ పరికరాల పథకాలకు దరఖాస్తు చేసుకొనగలరు. అభ్యర్థి సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు మరియు పట్టణ/ మున్సిపాలిటీ ప్రాంతాల వారికి రూ.2.00 లక్షలు మించి ఉండరాదు. మీ-సేవ నుండి పొందిన కులం మరియు ఒక సంవత్సరం లోపు ఆదాయ ధృవపత్రం, ఆధార్ కార్డ్ మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన దారిద్ర రేఖకు దిగువన కల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనగలరు. కావున అర్హత ఆసక్తికల షెడ్యూల్డు కులాల అభ్యర్థులు TGOBMMS ఆన్లైన్ పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నమోదు ప్రక్రియ తేదీ.17.03.2026 నుండి 24.03.2026 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కొరకు జిల్లాలోని ఎస్.సి.కార్పోరేషన్ కార్యాలయం, వికారాబాద్ జిల్లా, రూమ్ నెం.S-11&12, రెండవ అంతస్తు, సమీకృత జిల్లా ఆఫీసుల కార్యాలయము, కలెక్టరేటు నందు సంప్రదించగలరు. ఇతర వివరములకు 08416-255866 నందు సంప్రదించవలసినదిగా తెలియపారు.

Leave A Reply

Your email address will not be published.