- కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్,కాపు జేఏసీ ప్రతినిధులు.
- కాంగ్రెస్ తోనే కాపులకు న్యాయం – వైఎస్ షర్మిల.
విజయవాడ: కాపుల సమస్యలపై ఇటీవల ప్రతిపాదించిన 12 తీర్మానాలను కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్ పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేశారు. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ వైయస్ షర్మిల కు కాపుల సమస్యలను వివరించి చెప్పగా వైయస్ షర్మిల సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాపులను హక్కును చేర్చుకున్న చరిత్ర కాంగ్రెస్ దేనని.. కాపులకు పూర్తి న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆమె అన్నారు. కాపు జేఏసీ బలపరిచిన 12 తీర్మానాలకు వైఎస్ షర్మిల సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
- కాపు జేఏసీ బలపరిచిన తీర్మానాలు ఇవే.
1)కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని.
2)సమస్యల పరిష్కారంకోసం దశలవారి ఉద్యమం జిల్లా,డివిజన్,మండల స్థాయి సమావేశాలు అనంతరం విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో బహిరంగ సభలు.
3)రాష్ట్రం లో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని.
4)కృష్ణా జిల్లాకు, ఐకాన్ బ్రిడ్జ్ కు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారిపేరు నామకరణం చెయ్యాలి, కృష్ణదేవారాయలు జయంతిని ప్రభుత్వం ఆదికారికంగా నిర్వహించాలి.
5)కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 3000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలి.
6)హామీ మేరకు రెండు ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చెయ్యాలి.
7)కూటమి ప్రభుత్వం కాపులకు దామాషా ప్రకారం రాజకీయ,నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత నివ్వాలి.
8)కాపు ఉద్యోగస్తులకు పోలీస్,రెవిన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో పోకల్ స్థానాల్లో పోస్టింగ్ లు ఇవ్వాలని ఉద్యోగుల అణచివేత పై సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
9)రాష్ట్ర విభజన నేపద్యం లో తెలంగాణనుండి ఏపీ లో కలిసిన 7 ముంపు మండలాల మున్నూరు కాపు కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని.
10)యం.యస్.యం.ఇ.లో యస్.సి,యస్.టి,బి.సి, మైనారిటీమహిళలకు ఇచ్చే సబ్సిడీ 40శాతం కాపు,తెలగ, బలిజ, ఒంటరి మహిళల అమలు పనిచేయాలని ఓ.యం.యస్22నుసవరించాలని.
11)రాజధాని ఆమరావతి లో కాపు భవనానికి 5 ఎకారాలు కేటాయించాలి.
12)స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు, కృష్ణదేవరాయలు బారీవిగ్రహలను ఆమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలి కోరారు.ఈ కార్యక్రమం లో జే ఏ సి నాయకులు ఆకుల శ్రీనివాస్,నరహరి శెట్టి నరసింహారావు, కొండి శెట్టి రాజేంద్ర, సుంకర సాంబశివరావు (అల్లుడు), గంటా సాయి వర ప్రసాద్, చందు భావ నారాయణ, మాసా బత్తుల శ్రీనివాస్,మిరియాల శ్రీనివాసరావు, జొన్నా రాజేష్,శశి భూషణ్, పేర్ని దామోదర్, అలా తారక రామారావు, ఓటుకోలు మార్కండేయులు, తన్నీరు శివ శంకర్, లంకారంబాబు, ఆకుల తిరుమల రావు లు పాల్గొన్నారు.

