ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ సంకల్పం -తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దముల్ మండలం మారేపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 2 కోట్ల 30 లక్షల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు బాల్యదశలోనే నిర్ణయించుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఏ పని మొదలుపెట్టిన అది విజయవంతమవుతుందని, ముఖ్యంగా పదవ తరగతి అనేది మీ భవిష్యత్తుకు పునాది వంటిదని, ఈ దశలో చేసే కృషి పట్టుదల మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా తమ లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన నాటి నుండి విద్యార్థుల అభ్యున్నతి కోసం, గురుకుల పాఠశాలలో మేసు, కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగిందని, అదేవిధంగా విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు పాలు, గుడ్లు, పండ్లు, వంటి మంచి పోషకాహార పదార్థాలను సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఎక్కడ కూడా తగ్గకూడదని ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోర్డులు, లైబ్రరీ, సైన్స్ ల్యాబులు అనేక సదుపాయాలను బలోపేతం చేయడం జరిగిందని, అదేవిధంగా పాఠశాలలపాత భవనాలకు మరమ్మత్తులు నూతన భవనాలకు మరియు మౌలిక సదుపాయాలకై అధిక నిధులు కేటాయించి, విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తదనంతరం మారేపల్లి ప్రధాన రహదారిపై వెలసిన ఆర మైసమ్మ దేవాలయ 11వ వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. తాండూర్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వీరితోపాటు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగలి సునీత, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, శోభారాణి, లొంక నర్సింలు, మల్లేశం, ఎల్లారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ గ్రామాలసర్పంచ్ లు, విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.