పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా?
పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వలేదు
ప్రతి పైసా పోగు చేస్తాం.. పేదలకు పంచుతాం
పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం
అర్హత కలిగిన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు
నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు.. వారికి ఎందుకు ఓటు వేయాలని పట్టణ ప్రజలంతా ప్రశ్నించండి, ఆలోచించండని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నారు.
పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు వారికి ఓటు వేయాలా? మనందరినీ తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచినందుకు వారికి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఇక చాలు వారి పరిపాలన ముగిసిపోయింది అన్నారు. టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక ఇల్లు కానీ ఒక ఇంటి స్థలం కానీ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాయి తిరిగి ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని.. ఈ విషయాన్ని పేదల ఇంటికి సంబంధించిన ఏ ఇటుక పెళ్ళని అడిగినా చెబుతుందని అన్నారు. రాష్ట్ర వనరులు, ఆస్తులు, వ్యవస్థలు, ప్రజల కోసం ఖర్చు పెడతామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పోయింది అన్నారు.
పేదలు బడుగుల బాధలు అర్థం చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి వచ్చాకే పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఖర్చు చేస్తున్నాo. రాష్ట్రంలో మొదటి దశలో నాలుగున్నర లక్షల నిర్మాణం జరుగుతుంది ఇందుకుగాను 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా చేస్తామన్నారు.
టిఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం పాలనలో పేదలు రేషన్ కార్డు కోసం తిరిగి తిరిగి అలిసిపోయారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులను మంజూరు చేశాము రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా 1.02 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినలేక కోళ్ళ దానాకు ఉపయోగించేవారు కానీ నేడు కిలో 50 రూపాయల ఖరీదు చేసే సన్నబియ్యాన్ని మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రజా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు.
వృద్ధులు కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే ఆస్తులు పుస్తెలు తాకట్టు పెట్టుకునే పరిస్థితి ఇబ్బంది నుంచి పేదలను బయటపడేసేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, పేదల సంక్షేమం కోసం ఎంతటి ఖర్చుకైనా ప్రజా ప్రభుత్వం వెనుకాడ బోధని తెలిపారు.
మహిళలను మహాలక్ష్మి గా చూసుకునే సంప్రదాయం మనది వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని ప్రకటించాం, మేం ప్రకటించగానే ఇది సాధ్యమా అని కొందరు ఎద్దేవా చేశారు మరి కొందరు హేళనగా నవ్వారు కానీ మేం ఇచ్చిన మాటను నెరవేర్చడమే కాదు అంతకుమించి మొదటి సంవత్సరంలో స్వయం సహాయ సంఘాల మహిళలకు 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పైసా పోగేస్తాం పేదలకు పంచుతామని రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు.
మహిళలు రాష్ట్రంలోని ఒక మూల నుంచి మరో మూలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించాం మహిళల పక్షాన ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. డబ్బులు మిగిలితే ఇంట్లో ఇల్లాలు పిల్లల అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు అన్న ఆలోచనతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం విద్యుత్ సంస్థలకు ప్రతినెల పేదల పక్షాన ప్రభుత్వమే చెల్లిస్తుంది అని తెలిపారు.
పది సంవత్సరాలు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారు, పిల్లలు చదువుకునే ఉద్యోగాల్లో స్థిరపడతారని పేద తల్లిదండ్రులు కూలి నాలి చేసి డబ్బులు పంపితే మీరు పది సంవత్సరాలు పరీక్షలు నిర్వహించలేకపోయారు అని ఎద్దేవా చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం రాగానే గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించడమే కాదు ప్రజల సమక్షంలో ఉద్యోగ పత్రాలు అందజేశామని, అదేవిధంగా గ్రూప్ టు త్రీ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు రెండు సంవత్సరాల కాలంలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వాన్ని తెలిపారు.