- ఎమ్మెల్యేను కలిసి కాలనీవాసులు.
ముద్ర గండిపేట్ విలేకరి : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు పరిష్కారం చూపుతానని తిరుమల హిల్స్ ప్రెసిడెంట్ నల్లగొప్పుల హరీష్ గౌడ్ అన్నారు. శనివారం కార్పోరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో గల శివ సాయినగర్, తిరుమల హిల్స్ కాలనీ వాసులకు రూ.1.30 కోట్ల పనులు మంజూరు చేస్తూ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా మంజూరు కాపీ అందించారు.అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న ప్రకాష్ గౌడ్ ను కాలనీవాసులు శాలువాతో సన్మానించారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేను కాలనీవాసులు అందరూ ప్రశంసించారు.ఎల్లవేళలా తమకు అండగా ఉండాలని, ఎల్లప్పుడూ వారి సహయ సహకారాలు కాలనీవాసులకు ఉండాలని విన్నవించారు.ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే కాలనీ వాసులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మౌలిక వసతుల కల్పనలో రాజీపడకుండా, తన వంతు కృషి చేస్తూ అభివృద్ధి పనులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతికి ఆమోదం కోసం గవర్నర్ ను కలవడం, శుభపరిణామమని వివరించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పూలపల్లి కృష్ణారెడ్డి, రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్లు సాగర్ గౌడ్, సురేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, మాజీ ఎంపీటీసీ భోగాల శ్రీనివాస్, రాజారాం, కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.