Take a fresh look at your lifestyle.

బీజేపీ బలం తగ్గుతోందా…!

– పాలమూరు లోకసభ నియోజకవర్గం లో తగ్గిన ప్రాభవం
– ఏడు నియోజకవర్గాల్లో కనిపించని ఎంపీ నిధుల అభివృద్ధి
– ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉన్నా బీజేపీ అభ్యర్థి ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలు
– ఇప్పటి వరకు ఒక్క నియోజకవర్గం లో కేంద్ర నిధులతో అభివృద్ధి శూన్యం
– ఎంపీ డీకే అరుణ నియోజకవర్గం పర్యటనలకే పరిమితం…
– అభివృద్ధి కి పైసా విదిలించని ఎంపీ… ఏడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఆశలపై నీళ్లు
………………………………………..
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
పాలమూరు లోకసభ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ బలహీన పడుతోందా… ఈ లోకసభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కేంద్ర నిధులు పైసా విదిలించలేదా.. బీజేపీ శ్రేణులు కూడా ఉత్సాహాన్ని కోల్పోయారా.. అని అంటే అన్నింటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది.

ఈ లోకసభ నియోజకవర్గం పరిధిలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కొడంగల్ కూడా ఉంది.ఇదే కాకుండా మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, జడ్చర్ల, షాద్ నగర్ ఈ లోకసభ పరిలో ఉన్నాయి. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గా ల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేసింది. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు గెలుపొందినా 2024 లోకసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గం ప్రజలు ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ని కాదని బీజేపీ కి పట్టం కట్టారు. ఏడుగురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీ కి ఉంటే ఇక్కడ బీజేపీ ఎలా గెలిచిందని కాంగ్రెస్ అధిష్టానం తో పాటు అందరూ ఆచర్య పోయారు. అప్పట్లో ఈ ఏడుగురు ఎమ్మెల్యే ళా పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం చెందారు. జడ్చర్ల, షాద్ నగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కి కొంత అధిక్యం వచ్చింది. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ మెజారిటీ సాధించింది. నారాయణ పేట అసెంబ్లీ నియోజకవర్గం లో బీజేపీ కి 19 వేల పైనే మెజారిటీ వచ్చింది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పై 4499 ఓట్ల తేడా తో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉన్నా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచి సంచలనం సృష్టించింది. బీజేపీ గెలుపు పై రేవంత్ రెడ్డి కి కూడా మింగుడుపడలేదు. కేవలం ఈ లోకసభ నియోజకవర్గం లో నాలుగు సార్లు ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం రాకపోవడం తో ఇక్కడి ఎమ్మెల్యేల తీరు పై మండిపడ్డారు. నారాయణ పేట మినహా ఉనికి లేని బీజేపీ విజయం సాధించిందంటే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు పట్టించుకోలేదనే ఆరోపణలు అప్పట్లో చాలా వచ్చాయి. వంశీ చంద్ రెడ్డి కి ఏఐసీసీ తో పాటు రాహుల్ గాంధీ తో స్నేహ సంబంధాలు ఉండడంతో ఆయన ఇక్కడ ఎంపీ గా గెలుస్తే తమ ఉనికి పోతుందనే భయం తో ఎమ్మెల్యే లు లోలోపల బీజేపీ కి మద్దతు ఇచ్చారనే ఆరోపణలు మెండుగా వచ్చాయి. బీజేపీ నుంచి ఎంపీ గా గెలిచిన డీకే అరుణ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క అభివృద్ధి పనులు చేయలేదనే ఆరోపణలు మూటగట్టుకున్నారు.కేవలం పర్యటన లకే పరిమితం అయ్యారు కానీ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకు రాలేదని ప్రజల తో పాటు పార్టీ శ్రేణులు కూడా విమర్శలు చేస్తున్నారు. లోకసభ ఎన్నికలు జరిగి మరో రెండు నెలల్లో రెండేళ్ల కాలం పూర్తి అవుతుంది. ఈ 22 నెలల కాలం లో ఈ ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ చేసిన అభివృద్ధి శూన్యం అం చెప్పవచ్చు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీ డీకే అరుణ ఒక్కరే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రాచం చేపట్టారు. ఒక్క నారాయణ పేట మున్సిపాలిటీ లో మాత్రమే బీజేపీ విజయం పొందింది. అదికూడా ఎంపీ ఎక్స్ అఫిషియో ఓటుతో బీజేపీ గట్టెక్కింది. ఎంపీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి అంచునుంచి కాస్త బయటపడింది.ఈ ఏడు నియోజకవర్గాల్లో పది నెలల్లో బీజేపీ ప్రభావం పూర్తి గా పడిపోయింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఎంపీ ని పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. కేంద్రం నుంచి నిధులు తెస్తే ఎంపీ నిధుల కోసం ఎమ్మెల్యే లు ఎదురు చూసేవారు. ప్రస్తుతం ఎంపీ నిధులు ఖర్చు చేయక పోవడం తో ఎమ్మెల్యే లు ఎంపీ ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంపీ డీకే అరుణ కూడా ఈ నియోజకవర్గాలో ని ఎమ్మెల్యే లను పట్టించుకోకుండా పర్యటన చేస్తున్నారు. ఎమ్మెల్యే లు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపీ కి సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీ తో కలిసి అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సుముకంగా లేరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా రోజు రోజుకు బీజేపీ ప్రాభావం తగ్గిపోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
……………………………………..
మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం ప్రత్యేకత :
………………………………………
తెలంగాణలోని ముఖ్యమైన పార్లమెంట్ నియోజకవర్గం మహబూబ్‌ నగర్. 2007లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం ఏర్పడింది. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంతకుముందు దీని పరిధిలో ఉన్న అలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలను నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్, కొడంగల్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
1952లో తొలిసారిగా లోకసభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పులి రామస్వామి విజయం సాధించారు. ఈ స్థానానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగాయి.11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు సార్లు టీఆర్ఎస్,రెండు పర్యాయాలు జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగానూ పని చేశారు.
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణపై 77,829 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డికి 4,11,402 ఓట్లు పోలవగా.. డీకే అరుణకు 3,33,573 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీచంద్ రెడ్డి 1,93,631 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
2009లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత దేవరకొండ విట్టల్ రావుపై 20 వేలకుపైగా మెజార్టీతో కేసీఆర్ విజయం సాధించారు. అనంతరం మహబూబ్‌నగర్ ఎంపీగా ఉండగానే.. తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో సఫలీకృతమయ్యారు. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.ఈ లోక్ సభ స్థానంలో 2009 నుంచి వరుసగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచింది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కొడంగల్ నుంచి విజయం సాధించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.2024 లో మాత్రం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు. కెసిఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరికి మహబూబ్ నగర్ తో ఎక్కువ సంబంధం ఉంది. ఇక్కడి నుంచి ఎంపీ హోదా లో ఉండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన చేసిన కెసిఆర్ అనంతరం సీఎం అయ్యారు. ఇదే లోకాసభ నియోజకవర్గం లో ఉన్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికైన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.
అందుకే ఈ లోకసభ నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.