Take a fresh look at your lifestyle.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మహిళా కాంగ్రెస్ ఆందోళన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణక్క పిలుపుతో జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించడంతో పాటు ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ మంద వనజ, జిల్లా జనరల్ సెక్రటరీ కొడంగల్ రజిని, గొట్టే కవిత, టౌన్ అధ్యక్షురాలు మార్క పద్మ గౌడ్, బ్లాక్ ప్రెసిడెంట్ లహరి, మండల అధ్యక్షురాలు బాలలక్ష్మి, నంగునూరు మండల అధ్యక్షురాలు లావణ్య, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సంతోషి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోషి, సన శ్యామలతో పాటు మహిళా కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.