Take a fresh look at your lifestyle.

సన్న బియ్యం పంపిణీ చారితాత్మకం : ఎమ్మెల్యే సత్యం

మల్యాల, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని మండలంలోని నూకపల్లి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధుసూదన్ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 48 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలో అర్హులైన పేద ప్రజలందరికి రేషన్‌ కార్డులను మంజూరు చేస్తుందని, దీంతో లబ్ధిదారులకు నెలకు 15 వందల రూపాయల వరకు ఆదా అవుతుందని అన్నారు.గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయకపోవడం శోచనీయమన్నారు.ఈ కార్యక్రమంలో బత్తిని మల్లీశ్వరిశ్రీనివాస్ గౌడ్, దారం ఆదిరెడ్డి, మ్యాక లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, నాగుల పేట సంజీవ్, కొండబత్తినీ అనిల్, బివి రమణ పటేల్, నక్క అనిల్, ముద్దం శ్రీను, మర్రి లక్ష్మణ్, హరినాథ్, మిల్ట్రీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.