Take a fresh look at your lifestyle.

హత్య కేసులో 4గురు నేరస్తులకు జీవిత ఖైదు జైలుశిక్ష. జిల్లా ఎస్పి కె నర్సింహా

 

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిది:

మంత్రాల నెపం, భూవివాదం ఘటనలో 2015 సంవత్సరంలో జరిగిన హత్య కేసులో పోలీస్ శాఖ అత్యంత పారదర్శకమైన దర్యాప్తు చేసి బలమైన సాక్షాలు ఆధారాలతో నేర అభియోగ పత్రాలు కోర్టులో దాఖలు చేసి, సకాలంలో బాధితులను, సాక్షులను, నిందితులను కోర్టుకు హాజరుపచగా వాదనలు విన్న హుజూర్ నగర్ రెండవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ కోర్టు కేసులో నలుగురు నేరస్తులు నేరానికి పాల్పడ్డారని గుర్తించి జీవిత ఖైదు జైలు శిక్ష విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. కేసు వివరాలలోకి వెళితే గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో యెడిపాల వీరారెడ్డి, యెడిపాల లింగారెడ్డి పాలివారి రెండు కుటుంబాల మధ్య భూ వివాదం ఉన్నది. ఈ వివాదంలో ఇరు కుటుంబాలు తరచూ గొడవపడేవారు ఇందులో లింగారెడ్డి కుమారుడు అనారోగ్యానికి గురికావడానికి కారణం వీరారెడ్డి మంత్రాలు చేస్తున్నాడని నమ్మకంతో హత్య చేశారు. 2015 సంవత్సరం జూలై నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో వీరారెడ్డి పొలంలో మోటర్ బందు చేసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి తిరిగి రాకపోవడంతో వీరారెడ్డి గురించి వెతికిన అతని ఆచూకీ లభించలేదు జులై 20వ తేదీన వీరారెడ్డి కుమారుడు వీర భాస్కర్ రెడ్డి గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా 21వ తేదీ సాయంత్రం వీరారెడ్డి మృతదేహం రిజర్వాయర్ లో గన్ని బ్యాగులో లభించినది. మిస్సింగ్ కేసును హత్య కేసుగా తిరగరాసి అప్పటి హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తదుపరి విచారణ చేపట్టి యెడిపాల లింగారెడ్డి, యెడిపాల సత్యనారాయణ రెడ్డి, యెడిపాల ఉపేందర్ రెడ్డి, యెడిపాల సైదిరెడ్డి నలుగురు నిందితులను అరెస్టు చేసి నేరానికి పాల్పడినారని బలమైన ఆధారాలు, సాక్షాధారాల తో నేరాభియోగ పత్రాలను కోర్టుకు అందజేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు హత్య కోసం ఉపయోగించిన రెండు మోటార్ సైకీళ్ళు, రెండు ఐరన్ రాడ్స్, హెక్స్-ల్ బ్లేడ్, రాయి, పార ను స్వాదీనపర్చుకున్నారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసి కోర్టుతో సమన్వయంగా పనిచేసి నేరస్థులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించడం జరిగింది. 16 మంది సాక్షులను విచారించి, కేసు ఆధారాలను పరిశీలించిన హుజూర్ నగర్ కోర్టు న్యాయమూర్తి నిందితులు నలుగురు నేరానికి పాల్పడ్డారని నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష, ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగినది
కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో, హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు పర్యవేక్షణలో సాక్షులను కోర్ట్ నందు హాజరు పరచడం వల్ల ఈ రోజు రెండో అదనపు జిల్లా & సెసన్స్ జడ్జ్ హుజూర్ నగర్ ఇట్టి కేసులో నలుగురి నిందితులకు జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి 1500/-(మొత్తం 6000/-)జరిమానా విదించినారు. ఫైన్ కట్టని సమక్షంలో ఒక్కొక్కరికి 45 రోజుల సాదారణ జైలు శిక్ష విధించినారు. బాధితుల తరపున కేసును పబ్లిక్ ప్రసుక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి తరుపున బలమైన వాదనలు వినిపించినారు. గరిడేపల్లి ఎస్ఐ నరేష్, కోర్టు కానిస్టేబుల్ లు సైదులు, రాము కోర్టు అధికారులతో సమన్వయంగా పని చేశారు.
చట్టాలు బలోపేతం చేయబడ్డాయి కేసుల దర్యాప్తు, కేసుల చేతనలో పోలీసులు నైపుణ్యంతో పనిచేస్తున్నారు నేరాలకు తప్పులకు పాల్పడితే ఏనాటికైనా చట్టపరంగా జైలు శిక్షలు తప్పవు అని ఎస్పీ అన్నారు…

Leave A Reply

Your email address will not be published.