జిల్లాలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరత లేదు.. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి జిల్లాలోని ప్రజలకు విజ్ఞప్తి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరత లేదని భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి జిల్లాలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో జిల్లాలోని సేల్స్ ఆఫీసర్స్, పెట్రోల్ బంకుల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా నో – స్టాక్ బోర్డులు పెట్టకూడదని, ముందస్తు స్టాక్ బుకింగ్ చేసుకోవాలని, స్టాక్ 24 గంటలలో డెలివరీ చేయాలని సేల్స్ ఆఫీస్సర్లకు సూచించారు. పెట్రోల్ బంకులలో మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా ఎక్కువ ఇంధనం కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 – 3 రెట్లు విక్రయాలు పెరిగాయన్నారు.
• పెట్రోల్ లేదా డీజిల్ ను డబ్బాలు / క్యాన్లలో నిల్వ చేయడం పెసో నిబంధనలకు విరుద్ధమని ఇది అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చు అన్నారు.
అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెట్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి:
• భయాందోళనలతో ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దు.
• తమకు అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయండి.
• ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి.
• సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మకండి / ఇతరులకు పంపకండి.