Take a fresh look at your lifestyle.

శంషాబాద్ విమానాశ్రాయానికి బాంబు బెదిరింపు

 

ముద్ర, హైదరాబాద్ :
శంషాబాద్ విమానాశ్రాయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బెదిరించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహించారు. గురువారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన గల్ఫ్ ఎయిర్ లైన్స్ (జీఎఫ్ -274) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. విమానం గాల్లో ఉండగానే ఈమెయిల్ రావడంతో అధికారులు, విమానసిబ్బంది, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమన్వయంతో విమానాన్ని రన్ వే పై ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. వెంటనే రన్ వే కు దూరంగా ఉన్న ఐసోలేషన్ బే కి తరలించి తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్ట్ భద్రతా బలగాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి విమానం మొత్తాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. విమానంలో, ప్రయాణికుల లగేజీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్థారించడంతో.. అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు మెయిల్ హోక్స్ మెయిల్ అని తేలింది. ఈ ఘటనతో ఇతర విమాన సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఎయిర్ లైన్స్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి.. బాంబు బెదిరింపు మెయిల్ పంపింది ఎవరో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Leave A Reply

Your email address will not be published.