Take a fresh look at your lifestyle.

జీనియస్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జీనియస్ పాఠశాల ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు వారి మాతృమూర్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మహిళ మాతృమూర్తులు కుటుంబానికి సమాజానికి పునాది లాంటి వారిని వారి ప్రేమ త్యాగం సహనానికి నిలువెత్తు రూపాలని అన్నారు. అమ్మగా భార్యగా సోదరిగా కూతురుగా మమతాను రాగాలు పంచే స్త్రీ ఇంటిని దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే శక్తి స్వరూపిణి స్త్రీ అని వారి నిస్వార్థ సేవలను గొప్పతనాలను కొనియాడుతూ వారి మనసులోని భావాలను పంచుకున్నారు. మనసుకు అహల్లాదాన్ని కలిగించే మ్యూజికల్ చైర్ అంత్యాక్షరి లాంటి ఆటపాటల కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి స్వర్ణలత, ఏవో జి రవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.