Take a fresh look at your lifestyle.

10, 11న విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ బిల్డింగ్స్ కు సెలవు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కై వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, ఇతర పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటికీ పోలింగ్ ముందు రోజైన ఫిబ్రవరి 10, పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 న స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ వార్డులకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ మున్సిపాలిటీలలో పోలింగ్ నిర్వహణకై వినియోగించుకుంటున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు, ఇతర భవనాలకు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున రెండు రోజులు స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.