- పెద్దపల్లి డిసిపి కరుణాకర్.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: యోగా చేస్తే శారీరక, మానసిక సమస్యల నుండి కాపాడుకోవచ్చనీ డిసిపి కరుణాకర్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్.కే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి జ్యోతి ప్రజలను చేసి యోగా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, యోగ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలనీ, యోగా ద్వార రోగాల బారిన పడకుండా కాపాడు కోవచ్చనీ, పిల్లల నుండి పెద్దల వరకు యోగా చేయ్యవచ్చనీ, యోగ చేస్తే శారీరక, మానసిక సమస్యల నుండి కాపాడుకోవచ్చనీ అన్నారు. అసంక్రమిత వ్యాధులు సోకకుండా మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడానికి యోగా చాలా అవసరం అన్నారు. అనంతరం యోగ సేవలు అందించిన ఉద్యోగులకు జ్ఞాపికలు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజగోపాల్, రామచంద్ర మిషన్ ప్రతినిధి అంజనా దేవి, పతంజలి యోగ నుండి మమత , జిల్లా ఆయుష్ ఇంచార్జి డాక్టర్ అరుణ, వైద్య అధికారులు, రెడ్ క్రాస్ సభ్యులు రామచంద్ర మిషన్ యోగ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
