Take a fresh look at your lifestyle.

భువనగిరి ఖిల్లాపై బిఆర్ఎస్ జెండా ఎగరాలి.. బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి… మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో భువనగిరి ఖిల్లా పై బిఆర్ఎస్ జెండా ఎగరాలని ఎగరవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఓటర్లను కోరారు.
భువనగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భువనగిరి మున్సిపల్ పరిధిలోని 15,6,3,2వ వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని వార్డు ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ కుమార్, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మండల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.