Take a fresh look at your lifestyle.

బాలికల అపహరణ- అత్యాచార యత్నం కేసులో ఇద్దరి అరెస్టు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ ప్రాంతంలో ఇద్దరు బాలికలను అపహరించి, అత్యాచార యత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో నిందితులు అబ్బాస్ ఖాన్, షేక్ కలీమ్‌ లను నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు బాలికలను అపహరించి వారిపై అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణ కావడంతో నిందితులపై పోక్సో చట్టంతో పాటు బాధిత బాలిక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిబ్కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఒక ప్రకటన విడుదల చేస్తూ బాలికలను అపహరించి అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలపై నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.