ముద్ర , శేరిలింగంపల్లి – విలేకరి: మియాపూర్ కు చెందిన అక్షయ్ తేజ్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్న విషయము తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ రూ 50 వేల రూపాయల నగదు సహాయం అందచేసింది. మంగళవారం చందా నగర్ హుడా ఈ మేరకు మంగళవారం చందా నగర్ హుడా కాలనీ నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ భాదిత కుటుంబానికి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయ్, క్లబ్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా నగదును అంద చేశారు. ఆపదలో ఉన్న వారికి సహాయం అందచేయడంలో మా లయన్స్ క్లబ్ హోప్ సభ్యులు ముందు ఉంటారని కొండ విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు రమణ, మధుసూదన్ రెడ్డి, గాలి కృష్ణ, మారం వెంకట్ రెడ్డి, praveen Reddy, కాశీనాథ్, నాగరాజు, శాంతి భూషణ్ రెడ్డి, ప్రసాద్, విజయ్ భాస్కర్ గుర్రం, రాజశేఖర్, విష్ణుమూర్తి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.