బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాలికలకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు ఈ వ్యాక్సిన్ వేయించడం ఎంతో అవసరమని, ఇది భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మాల మమత , జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ గణేష్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వైద్యులు విద్య, రాజు, స్థానిక వైద్యాధికారులు రాఘవేందర్, రమ్యతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.