. తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ
ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పడిన రద్దీ సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ పరిష్కార మార్గం చూపించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తో కలిసి ఆదివారం పాత మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ రోడ్లపై వచ్చి విక్రయాలు చేస్తున్న వ్యాపారస్తులతో మాట్లాడారు. రోడ్లపై వచ్చి వ్యాపారాలు చేయడం వల్ల ప్రక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే వాహనదారులకు, అంబులెన్స్ వారికీ ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందికరంగా మారింది. ఇకనుంచి రోడ్డు పైకి రాకుండా రద్దీ లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.