Take a fresh look at your lifestyle.

విద్యార్థినికి అభినందన

 

కోరుట్ల, ముద్ర;
ఆదివారం రోజు ప్రకటించిన ఇంటర్ పరీక్షల ఫలితాలలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గుడిసె హాసిని ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించింది. వాసవి గ్రేటర్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో క్లబ్ అధ్యక్షులు ఓజ్జల వెంకటరమణ హాసిని నీ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టుదలతో చదివితే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది అని అన్నారు. పలువురు సంఘ సభ్యులు హసినిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పడిగల శ్రీనివాస్, ఏ. కృష్ణ కుమార్, ముక్క శ్యాం, ఏం ఎస్ ఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.