Take a fresh look at your lifestyle.

కేపీహెచ్‌బీలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర: సనాతన ధర్మ రక్షణే ధ్యేయం

ముద్ర కూకట్‌పల్లి :
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య సెంటర్ వేదికగా హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తుల భాగస్వామ్యంతో కాలనీ వీధులన్నీ కేసరి వర్ణంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున శోభాయాత్రను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం సనాతన ధర్మ పరిరక్షణకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
ధైర్యానికి, నిస్వార్థ సేవకు మారుపేరైన హనుమంతుని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.
డప్పు వాయిద్యాలు, “జై శ్రీరామ్” నినాదాల మధ్య అలంకరించిన హనుమంతుని విగ్రహంతో ఊరేగింపు సాగింది. స్థానిక వాలంటీర్లు, పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రసాద వితరణ చేశారు. భక్తిశ్రద్ధల మధ్య ఈ శోభాయాత్ర కనులపండువగా ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.