Take a fresh look at your lifestyle.

కరోనాలో సమయంలో పనిచేసిన స్టాఫ్ నర్స్ లకి న్యాయం చేయండి-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్

 

తొలగించిన స్టాఫ్ నర్స్ లకి ఎన్ హెచ్ ఎం లో ఖాళీగా ఉన్న పోస్టులతో భర్తీ చేయండి

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

2020 కరోనా సమయంలో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే 2024 లో తొలగించిన స్టాఫ్ నర్స్ లను ఖాళీ ఉన్న ఎన్.హెచ్.ఎం పోస్టులతో భర్తీ చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు సోమవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు స్టాఫ్ నర్సులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టరేట్ అబ్దుల్ హమీద్ కు వినతి పత్రం ఇచ్చారు.అనంతరం మాట్లాడుతూ కరోనా సమయంలో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక రిక్రూట్మెంట్ 2022లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన తీసుకున్న స్టాఫ్ నర్స్ లను 2024లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయం అన్నారు. వారిని ఉద్యోగం నుండి తొలగించడం సరికాదని అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని గతంలోనే కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ పలుమార్లు దృష్టికి తీసుకువెళ్ళమన్నారు. ఖాళీగా ఉన్న ఎన్ హెచ్ ఎం పోస్టులలో తొలగించిన వారిని తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని కాని ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన ఖాళీగా ఉన్న ఎన్ హెచ్ ఎం పోస్టులను భర్తీ చేయడంలో కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సిము మాట నిలబెట్టుకోవడంలో విఫలం చెందారని మండిపడ్డారు. ఇప్పటికైనా వారికి ఖాళీ పోస్టులలో వెంటనే పోస్టింగ్ ఇచ్చి వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలనికోరారు.లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు సంపత్, తార ,గీత, బాల్ లక్ష్మి, లక్ష్మి రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.