Take a fresh look at your lifestyle.

మైసమ్మ చెరువు కబ్జాపై బండి రమేష్ ఆగ్రహం

 

ముద్ర  కూకట్‌పల్లి:

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. బుధవారం అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్‌లో పాదయాత్ర చేపట్టిన ఆయన, మైసమ్మ చెరువు ఆక్రమణలను పరిశీలించారు.

మైసమ్మ చెరువును పూడ్చి కబ్జా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో పోసిన మట్టిని కబ్జాదారుల తోనే తిరిగి తవ్వించి తరలించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువులు

అంతరించిపోయాయని, వాటిని పునరుద్ధరించేందుకు ‘హైడ్రా’ అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.చెరువులో గుర్రపుడెక్క తొలగింపు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత లేదని, పనులు నిరంతరం

కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.