ముద్ర కాప్రా
అలుపెరగని పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చారిత్రక జెండా…
సంక్షేమం, అభివృద్ధి పథంలో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన గౌరవ చిహ్నం అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని,
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ నాచారం, కాప్రా ధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వారి యోగక్షేమాలను నిరంతరము పర్యవేక్షిస్తానని తెలిపారు
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, సాయి జన శేఖర్ పార్టీ నాయకులు
తీగుళ్ల శ్రీనివాస్ గౌడ్ , కుంటి కృష్ణ , వాసుదేవ్ గౌడ్ , ప్రవీణ్ , శ్రీనివాస్ నెల్లుట్ల , మల్లేష్ , ఉస్మాన్ , దయాకర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.