Take a fresh look at your lifestyle.

సిద్దిపేటలో జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి * ఆహ్వాన సంఘం చైర్మన్ గా చుక్క రాములు.

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈనెల 26,27, 28 తేదీలలో సిద్దిపేట పట్టణంలో జరుగుతున్నాయని సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఎం సిద్దిపేట జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాల స్వామి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయం కార్మిక కర్షక భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ సిపిఎం పార్టీ నిరంతరం పాలకుల అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రతిఘటిస్తూ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు .దేశంలో ఫాసిస్టు మతోన్మాద శక్తులు అన్ని స్థాయిల్లో విస్తరిస్తున్నాయి.ఈ రాజకీయ వాతావరణములో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అతిముఖ్యమైన రాజకీయ కర్తవ్యంగా భావించాలని, వామపక్ష, ప్రజాతంత్ర , సెక్యులర్ శక్తుల బలోపేతం కోసం ఐక్యపోరాటా లు నిర్మించేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని పిలుపు నిచ్చారు.రాజ్యాంగ, లౌకికతత్వం పరిరక్షణ కోసం దేశ రక్షణ కోసం అమెరికా సామ్రాజ్యవాదుల పట్టు నుండి దేశాన్ని రక్షించడం కోసం శ్రామిక ప్రజలను విశాల ఉద్యమాల నిర్మాణానికి సమీకరించడమే లక్ష్యంగా రాష్ట్ర కమిటి సమావేశాలు జరుగుతాయని తెలిపారు. దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి పోరాడుతుందని ఈ నేపథ్యంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సిద్దిపేటలో మొదటి సారి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి. రాఘవులు, ఏ.విజయ రాఘవన్ హాజరవుతున్నారని వీరితోపాటు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, 33 జిల్లాల నుండి రాష్ట్ర నాయకులు, వివిధ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వాన సంఘం చైర్మన్ గా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కోశాధికారిగా కాముని గోపాలస్వామి, ముఖ్య ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, ఉపాధ్యక్షులుగా రాళ్ల బండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, గొడ్డుబర్ల భాస్కర్, కార్యదర్శులుగా కొంగరి వెంకట మావో, చొప్పరి రవికుమార్, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.