ముద్ర, వనపర్తి :
మునిసిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని రాజకీయ పార్టీలు నియమావళి, నిబంధనలకు కట్టుబడి ఉండాలని జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల నిబంధనల పై అవగాహన కల్పించేందుకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు జనవరి 28 నుండి 30వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవచ్చని, ఉదయం 10-30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్దేశించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు వేసుకోవాల్సిందిగా సూచించారు. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ జనవరి 30, సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే అని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి (RO) గదిలోకి అభ్యర్థితో పాటు గరిష్టంగా ముగ్గురు సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి తప్పనిసరిగా అదే వార్డుకు చెందిన ఓటరై ఉండాలని, పోటీ చేసే అభ్యర్థి సదరు మున్సిపాలిటీ పరిధిలోని ఏ వార్డు ఓటరైనా అయి ఉండవచ్చని తెలిపారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన (Scrutiny) ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుందని, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు నిర్వ హించబడుతుందని తెలియజేసారు. వార్డు స్థానాలకు పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి జనరల్ అభ్యర్థి కి రూ.2500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులు ఏదైనా రిజిస్టర్డ్ బ్యాంకులో కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఖాతా నుంచి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల ప్రచారం కోసం సంబంధిత పార్టీల అభ్యర్థులు ముందస్తుగా తహసిల్దార్ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. సంబంధిత రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేసుకునే నాటి కల్లా ఫామ్ బి సమర్పించేలా చూసు కోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియ మావళిని పాటించాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post