Take a fresh look at your lifestyle.

ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజా గౌడ్….

 

ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంద్రాల నితీష అశోక్ ల నూతన గృహప్రవేశం గురువారం రోజు జరిగింది. కార్యక్రమానికి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.రాజా గౌడ్ (లోకల్ బాడీస్), కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్ రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించి, లబ్ధిదారులు ఇంద్రాల నితీష్ అశోక్‌లకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు లబ్ధిదారులకు నూతన వస్త్రాలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి మంజూరు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, జువ్వాడి కుటుంబానికి రుణపడి ఉంటామని తెలిపారు. లబ్ధిదారులు కృష్ణారావు ను శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మార్వో కృష్ణ చైతన్య, జోగన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గీతా రాణి, కోరుట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్, జోగన్ పల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వేల్పుల అంబేద్కర్, వార్డు సభ్యులు ఏలేటి గోపాల్ రెడ్డి , సైదు గంగాధర్, పైడిమడుగు గ్రామ శాఖ అధ్యక్షులు మరిపెల్లి జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.