- ముఖ్య నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం.
- సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం.
- రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి.
- కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు.
కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని గత ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు క్యాబినెట్ ఆమోదం పొందడం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషివల్లే సాధ్యపడిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. గడచిన పది సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కోరుట్ల నియోజకవర్గానికి 3 వేల 5 వందల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రోసిడింగ్ పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
