Take a fresh look at your lifestyle.

మంచినీటి స‌మ‌స్య‌ను పరిష్కరించండి త‌లారి చంద్ర‌శేఖ‌ర్

ముద్ర గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప‌రిధిలోని ఒకటవ వార్డు శివసాయినగర్, వెంకటేశ్వర్ నగర్ ల‌లో ప్ర‌జ‌లు మంచినీటి స‌ర‌ఫ‌రాలో ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం జ‌రుగుతుంద‌ని మాజీ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ జ‌ల‌మండ‌లి మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె అశోక్ రెడ్డికి వివ‌రించారు. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపి నీటిని అందించాల‌ని కాలనీవాసులతో క‌లిసి ఎండీని ఆయ‌న కోరారు.ఈ మేర‌కు ఎండీకి విన‌తిప‌త్రాన్ని అంద‌జేసి స‌మ‌స్య‌కు వివ‌రించారు.ఈ సంద‌ర్భంగా మాజీ కార్పొరేట‌ర్ మాట్లాడుతూ..స్థానిక ప్రజలు ఏళ్ల త‌రబ‌డి నీటి కోసం ఎదురు చూస్తున్నార‌ని తెలిపారు. డ్రైనేజీలు,సిసి రోడ్లు వేయడంతో ముందుగానే వాటర్ కనెక్షన్ క్యాన్ నెంబర్ తీసుకొని మంచినీటి బిల్లులు వేస్తున్నార‌న్నారు.కానీ మంచినీరు రాకపోవడం చాలా ఆవేద‌న క‌లిగిస్తుంద‌న్నారు.ఇప్పటికైనా మంచినీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోర‌డంతో ఎండీ సానుకూలంగా స్పందించి మ‌రో 15 రోజుల్లో మంచినీటిని అందిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు వివ‌రించారు. ఈ కార్యక్రమంలో శివ సాయి నగర్ కాలనీ ప్రెసిడెంట్ రమణారెడ్డి, రామారావు, రమేష్, సాగర్, వెంకటేశ్వర నగర్ కాలనీ ప్రెసిడెంట్ కృష్ణా, సాగర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.