Take a fresh look at your lifestyle.

మున్సిపల్ కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు-ఎస్పీ జానకి షర్మిల

 

అనుమతి ఉన్నవారికే ప్రవేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

శుక్రవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్, బారికేడింగ్, ప్రతినిధులు,అధికారులు, సిబ్బంది ప్రవేశంపై పాటించాల్సిన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, అనుమతి పత్రాలు ఉన్న సిబ్బంది మరియు ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు, గస్తీ బలగాల మోహరింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమీక్షలో భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.