పారిశ్రామికవాడలో పనులు నిలిపివేత
కేంద్ర కార్మిక చట్టాలపై సంఘాల తీవ్ర ఆగ్రహం
ముద్ర, చర్లపల్లి:
దేశవ్యాప్త సమ్మె లో భాగంగా చర్లపల్లి
పారిశ్రామికవాడలో కార్మికుల నిరసన ర్యాలీలు
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు చర్లపల్లి పారిశ్రామికవాడలో విస్తృత స్పందన లభించింది. వివిధ పరిశ్రమల కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, స్కీం వర్కర్లు పెద్దఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల పని నిలిపివేతతో పరిశ్రమల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులు భంగం కలిగిస్తాయని విమర్శించారు.
విద్యుత్ (సవరణ) బిల్లు–2025, వి.బి.జి–రామ్ జి చట్టం, నూతన జాతీయ విత్తన చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం ఎఫ్డీఐ నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించకూడదని, కనీస వేతనాన్ని రూ.26వేలుగా నిర్ణయించాలని కోరారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి హక్కులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నాయకులు తెలిపారు. ఎం.వి.యాక్ట్–2019లో ఇబ్బందికర నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు.
‘పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప’ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. సమ్మె శాంతియుతంగా కొనసాగినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బి.వి.సత్యనారాయణ, సిఐటియు మేడ్చల్ జిల్లా నాయకులు ఎం.శ్రీనివాస్ రావు, కొండల్ రెడ్డి, ఏఐటియుసి నాయకులు శంకర్ రావు, నర్సింహా, ఐఎఫ్ టియు నాయకులు శివబాబు, ఎపిరాక్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.మణికంఠ, గండూరి ఫుడ్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్ రెడ్డి, ఎస్ పిఎం పవర్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.నరసింహా, టికిల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.బాలరాజ్, శివఫ్రా క్రేన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్, ఆశీష్ క్రేన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, హైక్యూబ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.సంతోష్, 3డి ఫోమ్ కట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.ఆదాం, టికిల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.నాగేశ్వరరావు, ఐడీఏ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్మికులతో పాటు పెద్ద సంఖ్యలో వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు