ముద్ర, గద్వాల:
అయిజ మండలం చిన్నతండ్రపాడు గ్రామానికి చెందిన టూ వీలర్ మెకానిక్ బోయ సత్యం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా టూవీలర్ బైక్ మెకానిక్ సంఘం నాయకులు బాధిత కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించి, మృతి చెందిన బోయ సత్యం కుటుంబానికి 33,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడ్డమీది నాగిరెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బోయ సత్యం మృతి చెందడం దురదృష్టకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. జిల్లా అసోసియేషన్ ఆద్వర్యంలో బైక్ మెకానిక్ లు చేయూత నివ్వడం ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి, గద్వాల టౌన్ అధ్యక్షుడు సుభాన్ ,ఇక్బాల్, మధు, హరీష్, షబ్బీర్ పాల్గొన్నారు.