ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో 25వ వార్డులో నివసిస్తున్న దళిత వర్గానికి చెందిన వారికి ఇళ్లస్థలాలు ఇప్పించేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ మల్లేష్ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజా సమస్యలను తీర్చడంలో పార్టీ ముందుంటుందని, వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మల్లేష్ సతీమణి నాగలక్ష్మి మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన డక్కలి మిథున్ కుమార్ వారి వర్గాలందరికి ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. పొట్ట చేత పట్టుకుని తమ జీవనం కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని గుర్తించమని కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లను వీరికి ఇప్పించేలా స్పీకర్తో మాట్లాడుతామని అధికారుల సహకారంతో వీరందరికీ తగిన న్యాయం చేకూరేలా ఛాయాశక్తులకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టెక్కలి సంఘం నాయకులు మిథున్ కుమార్ రత్నమ్మ యాదమ్మ తదితరులు ఉన్నారు.