Take a fresh look at your lifestyle.

అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా? – చెత్తకుప్పలపై మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆగ్రహం

అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా…!

వార్డు ప్రచారంలో చెత్తను చూసి మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అసహనం

ముద్ర, నారాయణపేట :

అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా ఉంటే రోడ్ల పక్కన చెత్త ఎక్కడికక్కడే ఎందుకు పేరుకుపోయింది… డ్రైనేజీలలో చెత్త అస్తవ్యస్తంగా ఉంది అంటూ మున్సిపల్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 11,12,13 వార్డులలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలో ఓటర్ తో మాట్లాడుతుండగా ఒక్కరోజే అంత చెత్త ఉంటుందని నాలుగైదు రోజులైనా కూడా చెత్త తొలగించరని దీంతో దుర్వాసన ఇబ్బందులు వస్తున్నాయని ఓటరు మాజీ ఎమ్మెల్యేతో వార్డు సమస్య గురించి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.