ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ అధికారం పోయిన తరువాత రైతుల పట్ల బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నరని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ విమర్శించారు. సిద్ధిపేట లోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కోసం గన్నీ బ్యాగులు కొరత ఉన్నాయని తెలియడంతోఅయన మార్కెట్ యర్డు ను సందర్శించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కోసం గన్నీ సంచులు కొరత ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగ మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఆరెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని అన్నారు. సిద్ధిపేట మార్కెట్ యార్డు లో రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు ఉన్నాయని అన్నారు. రైతులు నిరసన తెలిపితే సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్ఎస్ కే దక్కిందని ఇప్పుడు అన్ని రకాలుగా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేస్తుంది అని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. వరి ధాన్యానికి సరిపడా గన్ని సంచులు ఉన్నాయి అని మక్క రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు లేవు అని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారు అని అన్నారు. మక్కా రైతుల కోసం 15 వేల బ్యాగులు అవసరమని తెలియడంతో వెంటనే ఇంచార్జ్ మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లాను అని అన్నారు. వెంటనే స్పందించిన ఇంచార్జ్ మంత్రి వివేక్ మార్కెట్ ఫెడ్ డీఎం తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానని ఇంచార్జ్ మంత్రి వివేక్ హామీ ఇచ్చారన్నారు.రైతులను బిఆర్ఎస్ కావాలని తప్పుదోవ పట్టిస్తున్నదని రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు బిఆర్ఎస్ రైతులను అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు కూడా ఆందోళనపడవద్దు అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలు రూపాయలు రుణమాఫీ చేసి చూపించడం అని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు రైతులను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు మానుకోవాలి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రెటరీ అర్షద్ హుస్సేన్. సాదిక్. ముదస్సిర్ రాజు నరేందర్ తదితరులు పాల్గొన్నారు