Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన ఉండాలి

  • జగిత్యాల ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేశ్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేశ్ అన్నారు.విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించిన పోలీస్ పాఠశాల కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేశ్ ఆద్వర్యంలో గౌతమ్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్.ఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ, గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చు అనే ఉద్దేశంతో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆలోచన మేరకు పోలీస్ పాఠశాల అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించడo జరిగిందన్నారు.పిల్లలకు సమాజం లో జరిగే సామాజిక అంశాలపై సరైన అవగాహన కల్పిస్తే, రేపటి సమాజం మరింత భద్రమవుతుంది అనే ఉద్దేశంతో పోలీస్ పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు సురక్షిత ప్రయాణ పద్ధతులు,రోడ్డు పై ఎలా సురక్షితంగా నడవాలి,రోడ్డు దాటేటపుడు పాటించవలసిన నియమాలు,సైకిల్ నడిపేటప్పుడు, కుటుంబ సభ్యులతో కార్,బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలు,హెల్మెట్, సీటుబెల్ట్ వాడక ప్రాముఖ్యత,రోడ్ల పై మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలు,రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు,అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు అవగాహన కల్పించడం జరిగినది. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురి అయినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్, జాబ్ ఫ్రాడ్, సైబర్ స్లేవరీ, సైబర్ స్టాకింగ్, ఏపికే ఫైల్ని ఉపయోగించి నకిలీ కస్టమర్ కేర్ మోసాలు, ఎక్కువగా జరుగుతున్నాయని వీటి పైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. విద్యార్థులు తమ దృష్టి కెరీర్ మీద మాత్రమే ఉండాలని,నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వారికి వివరించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వారియర్స్ గా పని చేయాలని కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుంధతి, ట్రాఫిక్ సిబ్బంది సంతోష్ ,లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.