- నేటి రామయ్య కళ్యాణానికి ముస్తాబైన ఆలయాలు.
గొల్లపల్లి, ముద్ర :అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం మండల వ్యాప్తంగా అన్ని ఆలయలలో భక్తులు ఘనంగా నిర్వహించారు.జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ సీత రామచంద్రస్వామి ఆలయ ధర్మకర్త ఆనంతుల భూమయ్య ఆధ్వర్యంలో శ్రీ రామనవమి పర్వదినం పురస్కరించుకుని సీతారములవారి కల్యాణం నిర్వహించారు.రంగు రంగుల పూలు, స్వాగత తోరణాలతో ఆలయంలో ఈ సందర్భంగా అశేష భక్తజన సందోహం నడుమ వేద మంత్రాలు,మంగళ వాయిద్యాలతో అర్చకులు తిరుణాహరి సత్యనారాయణ ఆచార్యలు సీతారాముల కల్యాణమహోత్సవాన్ని వైభవంగా,అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు.ఈ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా చూసేందుకు మండలంలో వేలాది మంది భక్తులు తరలివచ్చారు.ఆలయంలో హనుమాన్ భక్తులు రామ నామ స్మరణ తో మారుమోగింది.అనంతరం అన్నప్రసాద వితరణగా భోజనాలు ఏర్పాటు చేసిన్నారు.ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా స్థానిక పోలీస్ వారు బందోబస్తు ఏర్పాటు చేసిన్నారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
