Take a fresh look at your lifestyle.

అండర్–17 బ్యాడ్మింటన్ చాంపియన్‌గా హంసిని

యునెక్స్–సన్‌రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ముగింపు

అండర్–17 బాలికల సింగిల్స్‌లో చదరం హంసిని చాంపియన్

హైదరాబాద్, క్రీడాప్రతినిధి, జనవరి 7 : యెనెక్స్–సన్‌రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ (అండర్–15, అండర్–17) ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026 శనివారం ఘనంగా ముగిసింది. ఈ టోర్నీలో అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో చదరం హంసిని అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచి బంగారు పతకం సాధించింది. అదే విభాగంలో హంసిని రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మాజీ అంతర్జాతీయ కోచ్ భాస్కర్ బాబు విజేత హంసిని మరియు ఇతర క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మన చిన్నారుల ప్రతిభ అభినందనీయం. క్రమశిక్షణ, కఠిన సాధనతో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇలాంటి టోర్నీలు క్రీడాకారుల భవిష్యత్తుకు పునాది వంటివి” అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.