- పి ఎస్ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ముద్ర , శేరిలింగంపల్లి విలేకరి: నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులందరికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పి ఎస్ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, చాలా పవిత్రమైన పండుగ అని,మత సామరస్యానికి ప్రతీక అని ,త్యాగానికి ప్రతి రూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ మత సామరస్యాన్ని ప్రతిభింభించేలా బక్రీద్ పండుగను భక్తి శ్రద్దల తో జరుపుకోవాలని కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణు లందరికి బక్రీద్ పర్వదిన శుబాకాంక్షలు తెలియజేశారు. బక్రీదు పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద, మసీదు ల వద్ద అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకునేల అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని అధికారులను ఆదేశించారు.