Take a fresh look at your lifestyle.

వచ్చే ఎన్నికల నాటికీ బీఆర్ఎస్ ఉండదు

  • వంద సీట్లు గెలుస్తాం.
  • బీజేపీకి ఇంకా మతమేనా.
  • మెదక్ సభలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.
  • బీసీల గురించి కవితకు అప్పుడెందుకు గుర్తుకు రాలే.

ముద్ర ప్రతినిధి, మెదక్: వచ్చే ఎన్నికల నాటికీ బీఆర్ఎస్ ఉండదని అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. బనకచర్ల పాపం హరీష్ రావుదే అన్నారు. ఒక్క నీటి బొట్టు పోనివ్వమన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ప్రశాంగించారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రోహిత్ రావు సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికీ కండువా వేసి స్వాగతం పలికారు. పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ.. మెదక్ కాంగ్రెస్ అడ్డ జిల్లాల కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఇచ్చి మాట నిలబెట్టుకుందన్నారు. సీఎంగా కేసీఆర్ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. అన్నింటా ఫెయిల్ అయ్యారన్నారు. అందనమెక్కిస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేశారని కెసిఆర్ కుటుంబం పై ద్వజమెత్తారు. అందుకే ఎన్నికల్లో ఇంటికి పంపారని తెలిపారు. ఆర్థిక నిర్భంధం ఎంత ఉన్నా అన్ని పథకాలు ఇస్తున్నాము. కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తి కడుతున్నాము. ఆరడుగుల హరీష్ రావుకు ఏం అర్థం అవుతలేదు. బనకచర్ల విషయంలో అబద్దాలు ఆడుతున్నారన్నారు. సీఎం చెప్పినా నమ్మకం లేదా అన్నారు. ప్రజల మీద నమ్మకం లేదు. హరీష్ రావు అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు రాజకీయం చేయలేడు. కడుపు మంట అక్కస్సుతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రమ్మంటే కేసీఆర్, హరీష్ రావు రారు. మేమే ఫామ్ హౌస్ వస్తామంటే స్పందించరన్నారు. మీరు తాకట్టు పెట్టిన నీటిని మేం తెస్తామన్నారు. 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నాము. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. లిక్కర్ రాణి జైలులో ఉండగా 42 శాతం బిసి రిజర్వేషన్ గురించి నేను అడిగితే… నా పోరాటం వల్లనే అని రంగులు ఎందుకు పూసుకోవాలని కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గులాబీ రంగు కూడా మారిందన్నారు. బిసిల గూర్చి మీకేం సంబంధం. పదేళ్లు బిసిలు గుర్తుకు రాలేదా. ఐదేళ్లు మహిళలే లేకుండా క్యాబినెట్ నడిచింది. ఒక్క రోజైనా తండ్రిని అడిగావా అని ప్రశ్నించారు. యావత్ దేశం రాహుల్ గాంధీ వైపు చూస్తుంది. దేశ చరిత్రను పాదయాత్ర ద్వారా చదివారు.

  • ఇంకా మతం పేరిట బీజేపీ రాజకీయం.

బిజెపీ హిందూ పేరిటనే ఇంకా రాజకీయం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ద్వజమెత్తారు. . మోడీ ఏం ఎలగబెట్టారో చెప్పక 11 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ఆదాని, అంబానీలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.దేవుళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఇంకా కులం, మతం పేరిట మోసపోదమా అని ప్రజలను ప్రశ్నించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కులం ,మతం కాదు అభివృద్ది దిశగా బాటలు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం రెండు కళ్ళలా సాగుతుందన్నారు. వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అభివృద్ధి చెండుతుందన్నారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు చంద్రపాల్, రాజిరెడ్డి, హరికృష్ణ, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ, మొహాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ క్లిన్ స్విప్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ క్లిన్ స్విప్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు.సన్నబియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామన్నారు.కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రుణమాఫీ చేస్తామని మోసం చేశరన్నారు.తెలంగాణను లూటి చేసింది కెసిఆర్ అన్నారు.హైదరాబాద్ లో భూములు, కాంట్రాక్టుల్లో కమిషన్లు తీసుకోని లక్షల కోట్లు దోచుకున్నారని కెసిఆర్ ఫ్యామిలీపై ద్వజమెత్తారు.రేవంత్ రెడ్డి నేత్రత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.